Search for:
  • Home/
  • क्षेत्र/
  • కార్పొరేట్ స్థాయిలో జర్నలిస్టులకి ఫ్రీ హెల్త్ కార్డులు ఇచ్చిన మల్లారెడ్డి హాస్పిటల్ యాజమాన్యం

కార్పొరేట్ స్థాయిలో జర్నలిస్టులకి ఫ్రీ హెల్త్ కార్డులు ఇచ్చిన మల్లారెడ్డి హాస్పిటల్ యాజమాన్యం

హైదరాబాద్: మార్చ్ 2(భారత్ కి బాత్)

 

మల్లారెడ్డి హాస్పిటల్ వారు గత కొంతకాలంగా చెప్పినట్లుగా ప్రెస్ క్లబ్ జర్నలిస్టులందరికీ ఫ్రీ జర్నలిస్ట్ హెల్త్ కార్డ్స్ శుక్రవారం నాడు మధ్యాహ్నం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అందజేశారు. మల్లారెడ్డి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ భద్రా రెడ్డికి, వారి సతీమణి డాక్టర్ ప్రీతి రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేసిన సీనియర్ జర్నలిస్టులు. హెల్త్ కార్డు మేనేజర్ సందీప్ పవార్ మాట్లాడుతూ ఏ హెల్త్ కార్డుకైనా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందనీ కానీ ఈ మల్లారెడ్డి హెల్త్ కార్డుకి ఎక్స్పరి డేట్ అనేది లేదని తెలిపారు. జర్నలిస్టులు ఓపిలో వచ్చిన, ఐపీలో వచ్చిన ఈసీజీ, ఎక్స్ రే, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ వంటివి ఉచితంగానే అందిస్తామని, అలాగే సర్జరీలు కూడా మేజర్ గానీ, మైనర్ గానీ ఉచితంగానే చేస్తామని తెలిపారు.

తెలంగాణలో మొట్టమొదటిసారిగా జర్నలిస్టులకి ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఈ విధంగా సహాయాన్ని అందజేసినందుకు మల్లారెడ్డికి మరియు మల్లారెడ్డి హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required