పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
రంగారెడ్డి: జనవరి 7(భారత్ కి బాత్)
అమనగల్లు మున్సిపాలిటీకి చెందిన కండే సుమన్, చంద్రిక దంపతుల కుమార్తె కీర్తిక మొదటి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. ఆదివారం నాడు విఠాయిపల్లి సమీపంలో ఉన్న బి.ఎన్.ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం కసిరెడ్డి నారాయణ రెడ్డి చిన్నారిని ఆశీర్వదించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత చిన్నారి కుటుంబ సభ్యులతో, స్థానిక ప్రజలతో కాసేపు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జగన్, శివలింగం, కే.ఎన్.ఆర్ యూవసేన అధ్యక్షుడు బాబా, రంగారెడ్డి జిల్లా నాయకుడు విజయ్ రాథోడ్, భాస్కర్, కృష్ణ, సురేష్, సత్యం, శ్రీనివాస్, నాజర్ తదితరులు పాల్గొన్నారు.