నూతనంగా ప్రారంభమైన ఎస్పీ చాయ్ వాలా
రంగారెడ్డి: ఆగష్టు 31(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గం మనసానిపల్లి వెళ్లే దారిలో మంజు బేకారి ఎదురుగా మొహ్మద్ రియాజ్, సయ్యద్ షహీద్ సంయుక్త నేతృత్వంలో ఎస్పీ చాయ్ మేలా ను ముఖ్యఅతిథిగా విచ్చేసిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ ఇది తమ సెకండ్ బ్రాంచ్ అని తెలిపారు.
ఎండీ ఘోస్ మాట్లాడుతూ మా వద్ద ఇరానీ చాయ్ అద్భుతంగా ఉందని, బిస్కెట్లు, బేకరీ ఐటమ్స్ లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.