ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటు అత్యవసరం
ఎల్బీనగర్ లో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త
ఎల్బీనగర్: ఏప్రిల్ 13(భారత్ కి బాత్)
వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని రాష్ట్ర టూరిజం శాఖ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. మదర్ థెరిస్సా ఆశ్రయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ రింగ్ రోడ్డు కూడలిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం ఉప్పల శ్రీనివాస్ గుప్త ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ వేసవికాలంలో తాగేందుకు గుక్కెడు నీరు లభించక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వాహనదారులు, పాదాచారుల దాహార్తిని తీర్చేందుకు మదర్ థెరిస్సా ఆశ్రయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని ఆయన నిర్వాహకులను అభినందించారు. వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మరిన్ని చలివేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంతకుముందు ఉప్పల శ్రీనివాస్ గుప్తను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మదర్ థెరిస్సా ఆశ్రయ ఫౌండేషన్ అధ్యక్షులు సి. దస్తయ్య, ప్రధాన కార్యదర్శి అనపూసల రామస్వామి, సభ్యులు మధు, దుర్గాప్రసాద్, మహేందర్ గౌడ్, ఎస్. వెంకటేష్, రోహిత్, కేశవులు తదితరులు పాల్గొన్నారు.