Search for:
  • Home/
  • क्षेत्र/
  • సుప్రజ హాస్పిటల్ లో అన్ని రకాల వైద్య సేవలు అందించడం అభినందనీయం

సుప్రజ హాస్పిటల్ లో అన్ని రకాల వైద్య సేవలు అందించడం అభినందనీయం

రంగారెడ్డి: మార్చి 31(భారత్ కి బాత్)

 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేయనున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నాగోల్ లో సుప్రజ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్డియాలజీ, అడ్వాన్స్ సిటీ స్కాన్ విభాగాలను టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, ఎల్బీనగర్ ఇన్చార్జ్ మధు యాష్కిగౌడ్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుప్రజ హాస్పిటల్ లో అన్ని రకాల వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం వైద్యానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని అన్నారు. పెరుగుతున్న అనారోగ్య కారణాల దృష్ట్యా ప్రైవేట్ హాస్పిటల్ లో కూడా సేవలు అందించే కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎండి విజయ్ కుమార్, జనరల్ మేనేజర్ సతీష్ ముఖ్య అతిథులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎండితో పాటు బంధువులు, స్నేహితులు, డాక్టర్లు, స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required