ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్న మేరు సంఘం
రంగారెడ్డి: మార్చి 31(భారత్ కి బాత్)
మేరు కుల సంఘానికి కార్పొరేషన్ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే భారీ సభను విజయవంతం చేయాలని వ్యవస్థాపకులు మునిగాల రమేష్ మేరు కోరారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికలకు అన్ని లోక్ సభ సభ్యులకు మద్దత్తు తెలిపే విధంగా కమిటీ సభ్యులను నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా దిల్ సుఖ్ నగర్ మేరు సంఘంలో ఎల్. బి. నగర్ నియోజకవర్గం కమిటీని నియమించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ మేరు సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ మునిగాల రాము మేరు, వ్యవస్థాపకులు మునిగాల రమేష్ మేరు మాట్లాడారు. మేరు సంఘ నియోజకవర్గ కమిటీని ప్రకటించారు. ఇన్చార్జిగా మడిశెట్టి ఆనంద్, సభ్యులుగా మడిశెట్టి వెంకటేష్, తాళ్ల నరసింహులు మేరు, గట్ల పద్మనాభం మేరు, శ్రీకాంత్, శంకర్, జలంధర్, రాజేష్, మోహన్, వినోద్ కుమార్ తో పాటు 11 మంది సభ్యులను కూడా నియమించినారు.