పద్నాలుగు వేల ఐదు వందల అత్యధిక సభ్యత్వాలను నమోదు చేసిన సందర్భంగా…
రంగారెడ్డి: జనవరి 24(భారత్ కి బాత్)
అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ యూత్ కాంగ్రెస్ తరుపున ఆరు గ్యారెంటీల హామీలను డోర్ టు డోర్ ప్రచారం చేసి, రాష్ట్రoలో పద్నాలుగు వేల ఐదు వందల అత్యధిక సభ్యత్వాలను నమోదు చేసి మొదటి స్థానంలో నిలిచిన సందర్భంగా తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జక్కిడి శివ చరణ్ రెడ్డిని, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దీపదాస్ మున్షీ, రాజ్యసభ ఎం.పీ, సి.డబ్ల్యూ.సి మెంబర్ సయ్యద్ నజీర్ హుస్సేన్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి, సీనియర్ నాయకులు జగ్గా రెడ్డి, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డిని గాంధీ భవన్ లో సన్మానించి, జక్కిడి శివ చరణ్ రెడ్డిని అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.