నూతనంగా హయత్ నగర్ లో ప్రారంభమైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
రంగారెడ్డి: జనవరి 24(భారత్ కి బాత్)
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హైదరాబాద్ జోన్ జోనల్ మేనేజర్ సుశాంత్ కుమార్ గుప్తా, డిప్యూటీ జోనల్ మేనేజర్ మహమ్మద్ షజీబ్ సమక్షంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహిత్ రిషి చేతుల మీదుగా హయత్ నగర్‌లో ఆటోనగర్, హోటల్ రాజధాని కాంప్లెక్స్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యాధునిక శాఖను ప్రారంభించారు. హైదరాబాద్ జోనల్ మేనేజర్ సుశాంత్ కుమార్ గుప్తా ఈ శాఖను ప్రారంభించడం ద్వారా బిఓఏం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో మొత్తం 64 శాఖలను కలిగి ఉందని అన్నారు
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహిత్ రిషి మాట్లాడుతూ హైదరాబాద్‌లో కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించడం, రిటైల్ కస్టమర్‌లకు వేగంగా విస్తరిస్తున్న బ్రాంచ్‌లు, ఇతర ఛానెల్‌ల ద్వారా ముఖ్యంగా సూక్ష్మ స్థాయిలో వ్యాపారులకు బ్యాంకింగ్ సేవలను అందించాలనే మా నిబద్ధతను నెరవేర్చడం పట్ల మేము సంతోషిస్తున్నామని పేర్కొన్నారు. ఇది కస్టమర్ యొక్క బ్యాంకింగ్ అవసరాల కోసం ఒక స్టార్ట్ అప్ అవుతుందని అన్నారు. ఈ బ్రాంచ్ ద్వారా మా కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బ్యాంక్ భారతదేశంలోని 28 రాష్ట్రాలు మరియు 5 కేంద్రపాలిత ప్రాంతాలలో 2200 కంటే ఎక్కువ శాఖలతో 30 మిలియన్ల కస్టమర్లకు సేవలందిస్తోందని కూడా ఆయన పేర్కొన్నారు. రెండు శాఖల ప్రారంభోత్సవానికి హాజరైన ప్రముఖులు మరియు కస్టమర్లందరికీ కృతజ్ఞతలు తెలిపి, బ్యాంక్ యొక్క ఫలితాలు ప్రజలందరూ వినియోగించుకోవాలని హయత్‌నగర్ బ్రాంచ్ మేనేజర్ ప్రియాoక కోరారు.