ఆమనగల్లులో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలి: ఎంపీపీ జక్కు అనంత రెడ్డి
కల్వకుర్తి: జనవరి 9(భారత్ కి బాత్)
ఆమనగల్లు మండల సర్వసభ్య సమావేశం మంగళవారం నాడు ఎంపీపీ అనిత అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎంపీ రాములు పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో మండల వైస్ ఎంపీపీ జక్కు అనంత రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గ ప్రాంతానికి చెందిన మాజీ కేంద్రమంత్రి క్రీ”శే సూదిని జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఆమనగల్లు మండల ప్రజాపరిషత్ కార్యాలయ ప్రాంగణంలో స్థలాన్ని కేటాయించి, జైపాల్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డిని, అలాగే ఎంపీ రాములుని కోరారు. ఈ సర్వసభ్య సమావేశంలో అనంత రెడ్డి తీర్మానం చేయాలని కోరగా, సమావేశంలో పాల్గొన్న మిగతా ఎంపీటీసీలు, సభ్యులు అందరూ కలిసి తీర్మాణాన్ని ఆమోదించారు.