విజేతలకు 5,000 రూపాయలు బహుమతిగా అందజేసిన కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి
రంగారెడ్డి: అక్టోబర్ 27(భారత్ కి బాత్)
ఎల్.బి. నగర్ నియోజకవర్గం బి.ఎన్. రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్జీవోస్ కాలనీ ఛత్రపతి శివాజీ గ్రౌండ్ లో శ్రీకృష్ణ మెమోరియల్ యూత్ వారి ఆధ్వర్యంలో తోటిరెడ్డి రితీష్ రెడ్డి మెమోరియల్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో ఆదివారం నాడు బి.ఎన్. రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ టాస్ వేసి క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గానూ కార్పొరేటర్ తన సొంత నిధిలో నుంచి 5,000 రూపాయలు బహుమతిగా విజేతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, శరత్ కుమార్, పవన్ రెడ్డి, చిన్న యాదవ్, కౌశిక్, కిషోర్, భార్గవ్ తేజ, అనిల్, టోర్నమెంట్ సభ్యులు రవి, ఓం ప్రకాష్, కార్తీక్ నాయుడు, యుగేష్, కళ్యాణ్, చింటూ తదితరులు పాల్గొన్నారు.