కాలనీవాసులతో కలిసి డిప్యూటీ కమీషనర్ ని కలిసిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
రంగారెడ్డి: అక్టోబర్ 16(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి శ్రీనివాస కాలనీ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ యాదయ్యని వారి కార్యాలయంలో బుధవారం నాడు కలిశారు. ఈ సందర్బంగా కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస కాలనీలో మౌలిక వసతుల కొరత చాలా ఎక్కువగా ఉందని, ముఖ్యంగా మంచి పైప్ లైన్ సదుపాయం లేకపోవడం, భూగర్భ డ్రైనేజ్ సమస్యతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కావున సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి త్వరితగతిన కాలనీవాసుల సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమీషనర్ కి కార్పొరేటర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస కాలనీ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు క్రిష్ణ, శ్రీనివాస్, నర్సింహా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జిల్లా ఎస్సి మోర్చా ప్రధాన కార్యదర్శి పారంద మహేష్, బీజేపీ నాయకులు గంగాని శ్రీను తదితరులు పాల్గొన్నారు.