క్రీడాకారుల ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించాలి
క్రీడాకారిణికి ఉప్పల ఫౌండేషన్ ఆర్ధిక చేయూత
హైదరాబాద్: అక్టోబర్ 14(భారత్ కి బాత్)
క్రీడాకారుల్లో వున్న ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించాలని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. సోమవారం నాగోల్ లోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ యోగా ఆసన పోటీలకు ఎంపికైన పూజితకి ఖర్చులకి ఉప్పల ఫౌండేషన్ తరపున ఆర్ధిక సాయం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ జాతీయ స్థాయిలో రాణించి సమాజానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాకారులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమ్మాయి తల్లి లక్ష్మి, పూర్ణ, డా. ఎఆర్ గుప్త, ఆర్య వైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.