వనస్థలిపురంలో నూతనంగా ప్రారంభమైన వెజ్జీస్ విల్లా స్టోర్
రంగారెడ్డి: అక్టోబర్ 10(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్ టీవీ కాలనీ హనుమాన్ టెంపుల్ క్రాస్ రోడ్స్ లో గురువారం ఉదయం ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెజ్జీస్ విల్లా స్టోర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొప్రైటర్ స్టీవెన్సన్ మాట్లాడుతూ మా స్టోర్ లో కూరగాయలు, పళ్ళు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, కాయగూరలు సరసమైన ధరలకు లభిస్తాయని అన్నారు. ఈ అవకాశాన్ని కాలనీ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో వెజ్జీస్ విల్లా ఫ్రాంచైజీ ఛైర్మన్ శ్రోహిత్, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నేత క్యామ మల్లేష్ కురుమ, కుంట్లూరు వెంకటేష్ గౌడ్, మణికంఠ, లిఖిత్, సల్మాన్, వాయిద్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.