హయత్ నగర్ లో నూతనంగా ప్రారంభమైన చార్మి బ్యూటీ హబ్
ఎల్బీనగర్: సెప్టెంబర్ 27(భారత్ కి బాత్)
హయత్ నగర్ ప్రగతి నగర్ కాలనీ ప్లాట్ నెంబర్ 12 సి రోడ్ నెంబర్ వన్ ఏ లో బిగ్ బాస్ ఫేమ్ అశ్విని చేతుల మీదుగా ఘనంగా శుక్రవారం ప్రారంభోత్సవం జరిగింది. దినదినాభివృద్ధి చెందుతున్న హయత్నగర్ లో ఇంత చక్కటి సెలూన్ ప్రారంభోత్సవం కావడం ఇక్కడి ప్రజలందరి అదృష్టమని ఎంతో దూరం వెళ్లకుండా అందుబాటులోకి తీసుకువచ్చిన యాజమాన్యాన్ని అభినందించిన అశ్విని. ఆర్థికంగా బలోపేతం కావాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. మేనేజ్మెంట్ కవిత మాట్లాడుతూ మా షాపు యొక్క ప్రత్యేకతలు హైడ్రా ఫేషియల్, మిడిల్ మేకప్ ఫేషియల్స్, హెయిర్ ట్రీట్మెంట్స్, పెడిక్యూర్, మనీ కేర్, మసాజ్ వాక్సింగ్, శారీ బాక్స్ ఫోల్డింగ్, మెహంది నైల్ ఆర్ట్ శిక్షణ స్త్రీలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు.