Search for:
  • Home/
  • क्षेत्र/
  • గడ్డి అన్నారంలో ఎం.ఆర్. ఫ్యాషన్స్ ఎక్స్ క్లూజివ్ డ్రెస్సెస్ ఫర్ విమెన్ ను ప్రారంభించిన గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి

గడ్డి అన్నారంలో ఎం.ఆర్. ఫ్యాషన్స్ ఎక్స్ క్లూజివ్ డ్రెస్సెస్ ఫర్ విమెన్ ను ప్రారంభించిన గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి

రంగారెడ్డి: జూన్ 26(భారత్ కి బాత్)

 

గడ్డి అన్నారం డివిజన్ పరిధిలో శ్రీ కోదండరాం నగర్ కాలనీ శారదా థియేటర్ సమీపంలో నూతన ఎం.ఆర్. ఫ్యాషన్స్ ఎక్స్ క్లూజివ్ డ్రెస్సెస్ ఫర్ విమెన్ ను గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిoచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన ఎం.ఆర్. ఫ్యాషన్స్ నిర్వాహకులు కట్ల సంతోష్ కు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఎం.ఆర్. ఫ్యాషన్స్ మంచి పురోగతి సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు కట్ల సంతోష్ మాట్లాడుతూ ఓపెనింగ్ సందర్భంగా 10% డిస్కౌంట్ అందుబాటులో ఉందని, డిఫరెంట్ పేట్రన్స్ కూడా ఉన్నాయని తెలిపారు. కార్పొరేటర్ తో పాటు కంటెస్టెడ్ కార్పొరేటర్ కర్వాన్ బిజెపి అభ్యర్థి కట్ల అశోక్ కూడా పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కార్పొరేటర్ ప్రేమ్ కి కట్ల అశోక్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు దాసరి జయ ప్రకాష్, రామ్, రఘునందన్, టీంకు తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required