నానక్ రామ్ గూడలో డాక్టర్ గౌడ్స్ డెంటల్ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ, మధుయాష్కి గౌడ్
హైదరాబాద్: జూన్ 23(భారత్ కి బాత్)
నానక్ రామ్ గూడ పావని ఎన్కోర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్స్ ను వైద్య ఆరోగ్య మరియు సైన్స్ అండ్ టెక్నాలజీస్ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ లు శనివారం సాయంత్రం ప్రారంభించారు. సుమారు 50 ఏళ్ల నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో గౌడ్స్ డెంటల్ క్లినిక్ లను నిర్వహిస్తూ ప్రజల ఆదరణ పొందటం అభినందనీయమని వారు ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ శంకర్, డాక్టర్ వికాస్, డాక్టర్ స్నిగ్ధ తదితరులు పాల్గొన్నారు.