నూతనంగా ప్రారంభమైన వీర్ హెల్త్ కేర్ హాస్పిటల్
రంగారెడ్డి: మే 4(భారత్ కి బాత్)
హయత్ నగర్ లోని బీడీల్ కాలనీ భాగ్యలతలో డాక్టర్ కిరణ్ కార్తీక్ వీరంకి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వీర్ హెల్త్ కేర్ అసుపత్రిని శుక్రవారం స్థానిక డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మేల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి, వేర్వేరుగా హజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాగ్యలతలో అధునాతన పరికరాలతో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆసుపత్రిని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. హయత్ నగర్ భాగ్యలత పరిసర ప్రాంతాల సామాన్య ప్రజలకు, రోగులకు దీర్ఘకాలిక రోగగ్రస్థుల పట్ల ప్రేమ పూర్వక ఉపచర్యలు ఉండాలని, వచ్చే రోగులను ఆసుపత్రి వర్గాలు ఆదరించినప్పుడే గౌరవం పెరుగుతుందన్నారు. అదేవిధంగా నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని హాస్పిటల్ ఫీజు పరిమితికి ఉండే విధంగా, ప్రతి పేదవానికి కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందేలా చూడాలని ఆసుపత్రి యాజమాన్యానికి వారు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మల్కాజిరి పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ బండారి భాస్కర్, డివిజన్ ప్రధాన కార్యదర్శి గోవింద చారి, సీనియర్ నాయకులు శ్రీధర్, ఇతర నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.