Search for:
  • Home/
  • क्षेत्र/
  • వైదేహి నగర్ లో నూతనంగా ప్రారంభమైన ఎస్ పి రెస్టారెంట్

వైదేహి నగర్ లో నూతనంగా ప్రారంభమైన ఎస్ పి రెస్టారెంట్

ఎల్ బి నగర్: ఏప్రిల్ 28(భారత్ కి బాత్)

 

వనస్థలిపురం వైదేహి నగర్ లో ప్లాట్ నెంబర్ 32 లో ఆదివారం నాడు నూతనంగా ప్రారంభమైన ఎస్పీ రెస్టారెంట్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టిపీసీసీ కమిటీ చైర్మన్ యష్కి గౌడ్, బిజెపి ఆర్ఆర్ డిస్టిక్ అర్బన్ ప్రెసిడెంట్ సామ రంగారెడ్డి, కార్పొరేటర్ ముద్దులమొద్దు లచ్చిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ లీడర్ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ శుభ్రమైన నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందించాలని నిర్వాహకులను కోరారు. ఈ సందర్భంగా యాజమాన్య సభ్యులు మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాల ఆహార పదార్థాలు లభ్యమవుతాయని తెలిపారు. మా వద్ద మటన్ దమ్ బిర్యాని, ఫిష్ బిర్యానీ, చికెన్ బిర్యాని లభిస్తాయని, అలాగే తెలంగాణ చికెన్, కడాయి చికెన్, బటర్ చికెన్, మేతి చికెన్, మెంతి మటన్, మటన్ కాళీ మిర్చి అని అందుబాటులో ఉన్నాయని అన్నారు. మా వద్ద ఆరోగ్యవంతకరమైన ఆహారం దొరుకుతుందని అన్నారు. యాజమాన్య సభ్యులు పాటి వర ప్రసాద్, పురాణమటం విద్యా సాగర్, కర్నాటి గణేష్, వడ్డే ప్రశాంత్, కనుకుల శివ రాజేందర్ రెడ్డి. ఎస్పీ రెస్టారెంట్లో టేక్ అవే అలాగే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కూడా అందుబాటులో ఉందని ఎస్ పి రెస్టారెంట్ నెంబర్ 9392934483 ను సంప్రదించగలరని తెలిపారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required