నూతన వధూవరులను ఆశీర్వదించిన విజయ్ రాథోడ్
రంగారెడ్డి: ఏప్రిల్ 24(భారత్ కి బాత్)
కడ్తాల్ మండలంలోని నార్లకుంట తండా గ్రామ పంచాయతీకి చెందిన నేనావత్ కొంటి-కిషన్ నాయక్ కుమార్తె రాణి వివాహానికి కె.ఎన్.ఆర్ యువసేన జిల్లా నాయకులు విజయ్ రాథోడ్, మేడిగడ్డ తండా మాజీ ఉపసర్పంచ్ మల్లేష్ బుధవారం నాడు మైసిగండిలో ఉన్న ఆర్.పీ. సైన్ కన్వెన్షన్ హాల్లో జరిగిన వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రఘు నాయక్, రాజు నాయక్, శ్రీను నాయక్, సిద్దు నాయక్, కుమార్ నాయక్, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.