బిజెపి పార్టీ అభివృద్ధి కోసం శ్రమిస్తానని అంటున్న శివనేని దశరథ్
నాగార్జున సాగర్: ఏప్రిల్ 24(భారత్ కి బాత్)
భారతీయ జనతా పార్టీ నాగార్జున సాగర్ నియోజక వర్గం త్రిపురారం మండల యువ మోర్చా(బీజేవైఎం) మండల అధ్యక్షుడిగా కంపాలపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు శివనేని దశరథ్ ను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా దశరథ్ మాట్లాడుతూ ఇట్టి నా నియమాకానికి సహకరించిన జిల్లా బీజేవైఎం అధ్యక్షులు రాఖీకి, నాగార్జున సాగర్ యువ మోర్చా కన్వీనర్ కడియం సైదులుకి ప్రత్యేక కృజ్ఞతలు తెలిపారు. అలాగే సీనియర్ నాయకులు కిలారీ సైదులు, జొన్నలగడ్డ శ్రీనివాస రెడ్డి, జిల్లా నాయకులకు, మండల నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి గెలుపు కొరకు పనిచేస్తానని, అందరిని కలుపుకొని మండలంలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పునరుద్ఘాటించారు.