భట్టి విక్రమార్కకి కృతజ్ఞతలు తెలియజేసిన చల్లా నరసింహారెడ్డి
రంగారెడ్డి: మార్చి 19(భారత్ కి బాత్)
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి అర్బన్ ఫినాన్స్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని ప్రజా భవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి, శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. తన పైన నమ్మకంతో ఇచ్చిన పదవికి పూర్తి న్యాయం చేస్తానని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ చల్లా కవిత బాల్ రెడ్డి, కార్పొరేటర్ సిద్ధల మౌనిక శ్రీశైలం, చల్లా శ్రీనివాసరెడ్డి, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ మాజీ డైరెక్టర్ వెంకటేష్ గౌడ్, విజయ రెడ్డి, కీసరి యాదిరెడ్డి, శేఖర్ రెడ్డి, మురళి గౌడ్, సుభాష్ రెడ్డి, పరశురాం, పాల్గొనడం జరిగింది.