Search for:
  • Home/
  • क्षेत्र/
  • నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున వగ్గు వినయ్

నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున వగ్గు వినయ్

రంగారెడ్డి: మార్చి 19(భారత్ కి బాత్)

 

విద్యార్థుల రాజకీయ పార్టీ రాష్ట్ర ఆఫీస్ లో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను విద్యార్ధుల రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యెచ్చు సునీల్ మొదటి లిస్ట్ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా వగ్గు వినయ్ విప్లవ్ ని ప్రకటించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు సునీల్ మాట్లాడుతు తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచి, ఓటు వేయాలని, అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది. వినయ్ విప్లవ్ మాట్లాడుతు నా మీద నమ్మకంతో నాగర్ కర్నూల్ పార్లమెంట్ (ఎంపీ) అభ్యర్థిగా నియమించిన పార్టీ అధినేత సునీల్ కి ధన్యవాదాలు తెలిపారు. పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తానని, భారీ మెజరిటీతో పార్టీని గెలిపిస్తానని తెలపడం జరిగింది. యువతను పార్లమెంట్ కు పంపాలని నన్ను ఆశీర్వదించాలని, నాగర్ కర్నూల్ లోని ప్రతి ఓటర్ ను కోరడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్రా సుఖేందర్ రెడ్డి, భూక్యా నందు నాయక్, అనికేత్ కోషిగా అనిల్, పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required