జన రక్ష చిల్డ్రన్, ఫ్యామిలీ క్లినిక్ ప్రారంభం
ఎల్బీనగర్: ఏప్రిల్ 14(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని వనస్థలిపురం వైదేహి నగర్ లో శనివారం నాడు జన రక్ష చిల్డ్రన్, ఫ్యామిలీ క్లినిక్ ప్రారంభమైంది. ఈ క్లినిక్ ను డాక్టర్ జయశ్రీ, డాక్టర్ హరీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రకాల అధునాతన సదుపాయాలతో ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేకంగా చిన్నపిల్లలకు సంబంధించిన ప్రత్యేక పరికరాలు సమకూర్చినట్లు తెలిపారు. తక్కువ ధరలో మెరుగైన వైద్య సేవలు అందించాలానేదే మా ధ్యేయమని తెలిపారు.