Search for:
  • Home/
  • क्षेत्र/
  • క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి: ఉప్పల శ్రీనివాస్ గుప్త

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి: ఉప్పల శ్రీనివాస్ గుప్త

ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్ లీగ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

దేశానికి, రాష్ట్రానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి

హైదరాబాద్: మార్చి 31(భారత్ కి బాత్)

 

ఆదివారం నాడు హైదరాబాద్ లోని నాగోల్, బండ్లగూడ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఆవరణలో ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్ లీగ్ (సౌత్ జోన్ హైదరాబాద్) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐవిఎఫ్-అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త విచ్చేసి, జెండా ఊపి ప్రారంభించినారు. ఈ పోటీలు రెండు రోజుల పాటు మార్చి 30 నుండి మార్చి 31 వరకు నిర్వహించినారు. ఈ పోటీలలో మొత్తం ఐదు రాష్ట్రాలు సౌత్ స్టేట్స్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి 75 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలలో అండర్-16, అండర్-18, అండర్-18+, జూనియర్స్, సీనియర్స్, ఉమెన్స్ క్రీడాకారులు పాల్గొన్నారు.

 

తదనంతరం ఈ సందర్భంగా టూరిజం పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ఆటల, పోటీలు క్రీడాస్ఫూర్తిని పెంచుతాయని, గెలుపు ఓటములు ముఖ్యం కాదని, ప్రతి ఆటను స్పోర్టివ్ గా తీసుకోవాలని ఆడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ కొంత సమయం ఆటల కోసం కేటాయిస్తే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. క్రీడాకారులు మంచిగా క్రీడలలో రాణించి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో విజయం సాధించి, దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.

 

ఈ కార్యక్రమంలో ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్ లీగ్ సౌత్ జోన్ కో ఆర్డినేటర్ డా. మాక్స్వెల్ ట్రావెర్, ఎస్. కె. పాషా, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required