కార్తీకేయ కాన్సెప్ట్ స్కూల్ ప్రగ్యాన్ 2024 సైన్స్ ఫెయిర్ ఎక్సిబిషన్
ఎల్బీనగర్: మార్చి 8(భారత్ కి బాత్)
హస్తినాపురం డివిజన్ లోని జడ్పీ రోడ్ లో గల డిఆర్డిఎల్ పార్క్ నందు గురువారం నాడు కార్తీకేయ కాన్సెప్ట్ స్కూల్ ‘ప్రగ్యాన్ 2024’ సైన్స్ ఫెయిర్ ఎక్సిబిషన్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎల్.బి. నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సుజాత నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించి, వారి ప్రతిభను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పద్మ నాయక్, పాఠశాల యాజమాన్యం ప్రిన్సిపల్ గంజి శ్రావణ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ శీలం లీలా నాగేంద్ర, ఇస్రో సైంటిస్ట్ జి. శ్రీనివాస్, విద్యార్థినీ, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.