Search for:
  • Home/
  • क्षेत्र/
  • అతి ప్రాచీన శివాలయంలో శివరాత్రి వేడుకలు: ఆలయ ధర్మకర్త రావినూతల వంశీధర్

అతి ప్రాచీన శివాలయంలో శివరాత్రి వేడుకలు: ఆలయ ధర్మకర్త రావినూతల వంశీధర్

రంగారెడ్డి: మార్చి 8(భారత్ కి బాత్)

 

రాచకొండ దండుమైలారం గ్రామంలోని అతి ప్రాచీన శివాలయంలో శివరాత్రి వేడుకలను ఆలయ ధర్మకర్త రావినూతల వంశీధర్ నేతృత్వంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి రాత్రి వరకు వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించి అభిషేకాలు నిర్వహించి, స్వామి వారికి కళ్యాణ మహాత్సవం కూడా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నిర్వహించిన అభిషేక కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జాతీయ నాయకులు ఆలె శ్యాంకుమార్, మాజీ డీసీసీబీ డైరెక్టర్ తాడూరి జనార్థన్ రెడ్డి, బిజెపి జాతీయ నాయకులు పేరాల శేఖర్జీ, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. మనోహర్ రెడ్డి, బిజెపి భువనగిరి పార్లమెంట్ ఇంఛార్జ్ పాపారావు, తెలంగాణా రాష్ట్ర హైకోర్టు అడిషనల్ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు అమరలింగన్న, హెచ్ సి ఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షులు జగన్మోహన్ రావు, దండుమైలారం మాజీ సర్పంచ్ నిట్టు నరసింహ, దండుపాళ్లారం మాజీ ఎంపీటీసీ సభ్యురాలు బంగిని మట్టం సరోజమ్మ, మునప్ప కుటుంబ సభ్యులు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంతా రెడ్డి, శ్రీదేవి దంపతులు, బిజెపి రాష్ట్ర నాయకులు నిట్టు శ్రీశైలం, బిజెపి మండల కార్యదర్శి జంగం వెంకట్ రెడ్డి, బిజెపి కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి గుండ్ల శ్రీకాంత్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు నాయినేని హనుమంతరావు, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు ఈదులకంటి రామస్వామి గౌడ్, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు తుంకోజి సాయికుమార్ చారి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ దంపతులు, చింతల నరసింహ ముదిరాజ్, అభినేని రాఘవేంద్రరావు, కుమార అప్ప దిలీప్ రెడ్డి, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required