పట్లోళ్ల కార్తీక్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన అజ్జు
హైదరాబాద్: ఫిబ్రవరి 29(భారత్ కి బాత్)
గురువారం నాడు జల్పల్లి సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ అజ్జు పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కారించి, పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సయ్యద్ అజ్జు మాట్లాడుతూ కార్తీక్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశానని తెలిపారు. అలాగే ఎంతోమంది నిరుపేదలకు సహాయ సహకారాలు అందించారని, ఏ ఒక్కరికి కష్టం వచ్చిందని మొరపెట్టుకున్న, వెంటనే పరిష్కారo దిశగా అడుగు లేస్తారని కొనియాడారు. ఎన్నో ఉన్నత శిఖరాలకు, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మనస్పూర్తిగా కోరానని తెలిపారు.