సీసీ రోడ్ల ద్వారా గ్రామాల రూపురేఖలే మారిపోతాయి: ఎంపీపీ అనితవిజయ్
మేడిగడ్డ తండా గ్రామపంచాయతీలో పనులు ప్రారంభించిన ఎంపీపీ
రంగారెడ్డి: ఫిబ్రవరి 17(భారత్ కి బాత్)
సీసీ రోడ్ల నిర్మాణంతో గిరిజన తండాల రూపురేఖల్లో మార్పు వస్తుందని ఆమనగల్లు మండల ఎంపీపీ అనితవిజయ్ అన్నారు. శనివారం నాడు ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా గ్రామపంచాయతీలో ఎంపీపీ నిధుల నుంచి 2.10 లక్షల రూపాయలతో, అలాగే కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో ఎన్.ఆర్.ఈ.జీ.ఎస్ నిధుల నుంచి 10 లక్షల రూపాయలతో మొత్తం 12.10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ అనితవిజయ్ మాట్లాడుతూ తండాల్లో మరిన్ని సీసీ రోడ్లు రావడానికి కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వెంకటయ్య, మాజీ ఉప సర్పంచ్ మల్లేష్, కె.ఎన్.ఆర్ యువసేన జిల్లా నాయకులు విజయ్ రాథోడ్, నాయకులు పురుషోత్తం, హేమ, సోంల్ల, వినయ్, శ్రీను, హన్మ తదితరులు పాల్గొన్నారు.