అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: సెప్టెంబర్ 12(భారత్ కి బాత్)
వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా గురువారం గడ్డిఅన్నారం డివిజన్‌లోని మధురపురి కాలనీ, లలితానగర్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గణపతి మహదేవుని ఆశీస్సులు కోరుతూ అన్నదాన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రజలకు అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు దాసరి జయ ప్రకాష్, వివిధ కాలనీ వాసులు బాబు, రాకేష్, కృష్ణ లోయ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.