జెడ్పి రోడ్లో నూతనంగా ప్రారంభమైన శ్రీ బాలాజీ జ్యువెలర్స్
రంగారెడ్డి: అక్టోబర్ 12(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం బి.ఎన్.రెడ్డి డివిజన్ హస్తినాపురంలోని జెడ్పి రోడ్ లో విజయదశమి సందర్భంగా శనివారం నాడు నూతనంగా ప్రారంభమైన శ్రీ బాలాజీ జ్యువెలర్స్. ఈ సందర్భంగా ప్రోప్రైటర్ వి. రవి మాట్లాడుతూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ, దసరా రోజు బంగారం షాపుని ప్రారంభించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. అలాగే మా వద్ద రెడీమేడ్ బంగారు గొలుసులు, నెక్లెస్ లు ఉన్నాయని, 916 kdm బంగారం ఆర్డర్ పై కూడా తయారు చేస్తామని అన్నారు. బంగారం మరియు వెండికి సంబంధించిన అన్ని వస్తువులు లభిస్తాయని, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ వినియోగదారుల సంతృప్తి మాకు ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.