వల్లభాపూర్ దుర్గామాత కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
నాగర్ కర్నూల్: అక్టోబర్ 10(భారత్ కి బాత్)
లింగాల మండలంలోని వల్లభాపూర్ గ్రామంలో దేవి నవరాత్రుల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాత జూపల్లి యాదగిరి రావు, రామారావు, వల్లాభపూర్ గ్రామస్తులందరూ పెద్దవాళ్లు, చిన్నవాళ్లు, ప్రతి ఒక్కరూ కలిసి ఎన్నడూ లేని విధంగా దుర్గా అమ్మవారికి ఒడి బియ్యం, పూజలు, అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, దుర్గామాత యూత్ కమిటీ కలిసి వర్షం వచ్చినా లెక్కచేయకుండా అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా వారి కుటుంబసభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నామని వల్లభాపూర్ దుర్గామాత కమిటీ సభ్యులు తెలిపారు.