మంత్రి ఉత్తమ్ తండ్రి పురుషోత్తమ్ రెడ్డి దశదిన కర్మలో కెఎల్ఆర్
మహేశ్వరం: అక్టోబర్ 11(భారత్ కి బాత్)
హైటెక్స్ లో జరిగిన నలమాద పురుషోత్తమ్ రెడ్డి దశదిన కర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతున్ని కేఎల్ఆర్ ప్రార్థించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మధుసూదన్ రావు, వెంకటేష్ గౌడ్, ధన్ రాజ్ గౌడ్ సహా పలువురు నేతలు నివాళులర్పించారు.