Search for:
  • Home/
  • क्षेत्र/
  • మృతుల కుటుంబాలకు రూ.10,000 ల ఆర్థిక సహాయం చేసిన రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్

మృతుల కుటుంబాలకు రూ.10,000 ల ఆర్థిక సహాయం చేసిన రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్

రంగారెడ్డి: అక్టోబర్ 9(భారత్ కి బాత్)

 

కడ్తాల్ మండలంలోని గానుగుమర్ల తండా గ్రామపంచాయతీ పరిధిలోని కానుగుబాయి తండాకు చెందిన ఇస్లావత్ బిచ్చి అనారోగ్యంతో బుధవారం ఉదయం 6 గంటలకు మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న కడ్తాల్ మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ వెంటనే కానుగు బావి చేరుకొని బిచ్చి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి జర్పుల దశరథ్ నాయక్ రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు. అనంతరం మండలంలోని రావిచెడు గ్రామానికి చెందిన కళావతి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి కూడా 5000 వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి గోపాల్, డైరెక్టర్ సేవ్య నాయక్, మాజీ సర్పంచ్ రాములు, మాజీ ఉపసర్పంచ్ శారదా పాండు, రైతు సమితి సభ్యులు నరసింహ, డైరెక్టర్ లాయక్ అలీ, మాజీ వార్డు సభ్యులు భీమన్ లక్ష్మణ్, నాయకులు లక్ పతి, శ్రీను, రాజు, బిచ్చియ్య, టిక్ లాల్ కిషన్, చందర్, కోటియ్య పాండు, సేవ్య లక్ష్మణ్, రవి, గోపి, శంకర్, జెడిఎన్ వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్, నర్సింగ్, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required