శ్రీ సాయి నగర్ కాలనీ ఓనర్స్ అసోసియేషన్ కమిటీ హాల్ ను ప్రారంభించిన ఈటల రాజేందర్
రంగారెడ్డి: ఆగష్టు 12(భారత్ కి బాత్)
ఎల్. బి. నగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ శ్రీ సాయి నగర్ కాలనీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా శ్రీ సాయి నగర్ కాలనీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి మాట్లాడుతూ కమిటీ హాల్ ను ప్రారంభించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కి ధన్యవాదాలు తెలుపుతూ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి ఈటల రాజేందర్ కు విన్నవించారు. ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం, వాటర్ ఫ్లో తక్కువగా రావడం, డ్రైనేజీ వ్యవస్థ అక్కడక్కడా సరిగ్గా లేకపోవడం వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. ఈటల రాజేందర్ వెంటనే స్పందించి నిధులు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, స్థానిక కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్, శ్రీ సాయి నగర్ కాలనీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోగుల మల్లారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ టి. మల్లప్ప, జనరల్ సెక్రటరీ బోమిడికా యుగంధర్ రెడ్డి, ట్రెజరర్ మద్ది కృష్ణారెడ్డి, జాయింట్ సెక్రటరీ కట్ట గోపాల్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ వి. శ్రీధర్, అడ్వైజర్స్ పి. జగన్మోహన్ రెడ్డి, జె. ఎస్. ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ టి. కృష్ణమూర్తి, వి.క్రాంతి కిరణ్, కె. మోహన్ రెడ్డి, ఎమ్. నర్సింహా యాదవ్, జి. రామ్ మోహన్ రెడ్డి, ఆర్. పి. ఠాకూర్, కె. సందీప్ రెడ్డి, ఎమ్. శ్రీనివాసా చార్యులు, ఎల్. వీరా రెడ్డి, ఎమ్. వెంకట్ రెడ్డి, ఇతర కాలనీ సభ్యులు, కాలనీ వాసులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.