ఎర్రకుంటలో నూతనంగా ప్రారంభమైన ఎన్ హెచ్ అండ్ సన్స్ రైస్ ట్రేడర్స్
రంగారెడ్డి: జులై 19(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీ ఎర్రకుంటలోని టోటల్ ఎనర్జీస్ గ్యాస్ పంప్ ఎదురుగా గురువారం నాడు ఎన్ హెచ్ అండ్ సన్స్ రైస్ ట్రేడర్స్ ను కాంగ్రెస్ మహేశ్వరం ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. అలాగే సయ్యద్ హమీద్ ఉద్దీన్, సయ్యద్ నజీర్ ఉద్దీన్ లు కూడా ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. యజమానులు ఫయాజ్ అలీ మరియు ఇలియాస్ హుస్సేన్ లు మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాల సోనామసూరి రైస్, హెచ్ఎంటి, రా మెటీరియల్, బాస్మతి రైస్, అన్ని రకాల పప్పులు అన్ని సరసమైన ధరలకే అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉస్మాన్ అలీ, ఇబ్రహిం అలీ, సయ్యద్ హమీద్ ఉద్దీన్, సయ్యద్ నసీర్ ఉద్దీన్, ఇంతియాజ్ హుస్సేన్, స్నేహితులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.