మొద్దు లచ్చి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన వివిడ్ రే ప్రీస్కూల్
రంగారెడ్డి: ఏప్రిల్ 13(భారత్ కి బాత్)
దేశ భవిష్యత్తు పాఠశాల తరగతి గదుల్లో తయారవుతుందని బి.ఎన్. రెడ్డి నగర్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి తెలిపారు. ఎల్. బి. నగర్ నియోజకవర్గ పరిధిలో వనస్థలిపురం ఎన్.జి.ఓ.ఎస్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వివిడ్ రే ప్రీ స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైనారు. అలాగే మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్నతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ విద్యార్థులను తీర్చి దిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. పిల్లలకు ఆటపాటలతో విద్యాబోధన సాగించాలని సూచించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బొడ్డు సుధీర్ గౌడ్, కరస్పాండెంట్లు సాహితి, దేవి శ్రీ మాట్లాడుతూ చిన్నారులను సొంత పిల్లల్లాగా భావించి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆటపాటలతో, ఉల్లాస, ఉత్సాహకరమైన వాతావరణంలో విద్యాబోధన జరుగుతుందని అన్నారు. నర్సరీ, జూనియర్, సీనియర్ కే.జి., డే కేర్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, యాజమాన్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.