నల్గొండ పార్లమెంట్ సీటును గెలిచి ప్రధాని మోడీకి బహుమతిగా పంపుదాం: నూకల నరసింహారెడ్డి
నల్గొండ: ఫిబ్రవరి 23(భారత్ కి బాత్)
మిర్యాలగూడ నియోజకవర్గంలో శుక్రవారం నాడు బిజెపి విజయ సంకల్ప యాత్ర సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి నెల 29వ తారీఖు నాడు యాత్ర మిర్యాలగూడకి చేరుకుంటుందని, మిర్యాలగూడలోని కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొని యాత్రని విజయవంతం చేసి, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ లో బిజెపి జెండాని ఎగిరేసి నరేంద్ర మోడీకి బహుమతిగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాధినేని శ్రీనివాసరావు, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి, యాత్ర జిల్లా ఇన్చార్జి పోతేపాక సాంబయ్య, బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు కొండేటి సరిత, దళిత మోర్చా అధికార ప్రతినిధి ఎట్ల రమేష్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిల్లంచర్ల రవి, జిల్లా ఉపాధ్యక్షులు రేపాల పురుషోత్తం రెడ్డి, మిర్యాలగూడ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ బాణావతి రతన్ సింగ్ నాయక్, జిల్లా నాయకులు, పట్టణ నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.