కల్వకుర్తి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం పూజలో పాల్గొన్న మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్
కల్వకుర్తి: జనవరి 16(భారత్ కి బాత్) సంక్రాంతి పర్వదిన సందర్భంగా శ్రీశ్రీశ్రీ లక్ష్మీ చెన్నకేశవ దేవస్థానంలో ఏర్పాటుచేసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి అభిషేక కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, 8వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ చినరామిరెడ్డి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అలాగే గణపతికి, ఆంజనేయ స్వామికి కూడా పట్టు వస్త్రాలు సమర్పించి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. నవ గ్రహ పూజలో పాల్గొన్నారు. [...]