క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించిన రామాంజనేయ యూత్
కల్వకుర్తి: జనవరి 13(భారత్ కి బాత్)
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కల్వకుర్తి పట్టణంలోని స్టేడియంలో రామాంజనేయ యూత్ నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్. రామాంజనేయ యూత్ వారు ఏర్పాటు చేసిన కబడ్డి టోర్నమెంట్ లను కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ ప్రారంభించారు. అనంతరం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఆటలు, పోటీలలో గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఆటలు, పోటీలకు నా సహకారం ఎల్లపుడు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సంజీవ్ కుమార్ యాదవ్, కౌన్సిలర్ లు గోరటి శ్రీనివాసులు, సతీష్, రమాకాంత్ రెడ్డి, ఆంజనేయులు, విక్కీ, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.