జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
నాగర్ కర్నూల్: జనవరి 11(భారత్ కి బాత్)
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శాంతకుమారి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమీక్షా సమావేశంలో పాల్గొని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులకు, అధికారులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి. ఈ కార్యక్రమంలో అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్. చిక్కుడు వంశీకృష్ణ, వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాసింగ్, జడ్పీ సీఈవో, వివిధ మండలాల జడ్పిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.