హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం
హైదరాబాద్: డిసెంబర్ 21(భారత్ కి బాత్)
అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ, మహబూబ్ మాన్షన్, మలక్ పేట్ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులచే వ్యవసాయ మార్కెట్ కమిటీ, హైదరాబాద్ నకు నియామకమైన చైర్మెన్, వైస్ చైర్మెన్, పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం నాడు ఎంతో ఘనంగా జరిగింది. ఈ ప్రమాణం మహోత్సవ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేస్తున్న చైర్మన్ చేకోలేకర్ లక్ష్మీ శ్రీనివాస్, వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్, పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. వీరు ఈ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పదవులను సక్రమంగా నిర్వర్తించి, భవిష్యత్తులో మంచి స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, వైస్ చైర్మన్, పాలకవర్గం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.