శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న నిట్టు శ్రీశైలం, శ్లోక స్కూల్ చైర్మన్ బిట్ల శ్రీనివాస్ రెడ్డి
రంగారెడ్డి: జనవరి 22(భారత్ కి బాత్)
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రాచకొండ మైలారం(దండుమైలారం) శివాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం మరియు అయోధ్యలో జరిగిన బాలరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని రాచకొండ మైలారం, వ్యవసాయ ప్రాథమిక సంఘం మాజీ చైర్మన్, దండు మైలారం మాజీ సర్పంచ్, శ్రీమతి శ్రీ తాడూరి భారతమ్మ జనార్దన్ రెడ్డిల ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవం అన్న ప్రసాదం ఏర్పాటు చేసినారు. శివాలయంలో శ్లోక స్కూల్ చైర్మన్ బిట్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో డిజిటల్ స్క్రీన్ ను భక్తుల కోసం ఏర్పాటు చేసి, కార్యక్రమంలో పాల్గొని, ప్రాణప్రతిష్ట మహోత్సవాన్ని వీక్షించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిట్టు శ్రీశైలం, దండు మైలారం గ్రామ సర్పంచ్ శ్రీమతి శ్రీ రమణమోని మల్లేశ్వరి జంగయ్య ముదిరాజ్ దండు మైలారం ఎంపీటీసీ శ్రీమతి శ్రీ ఈదులకంటి అరుణ చంద్ర గౌడ్, దండు మైలారం మాజీ సర్పంచ్ నిట్టు నరసింహ, దండు మైలారం ఎంపీటీసీ శ్రీమతి శ్రీ పిట్టల అనసూయ సీతయ్య ముదిరాజ్, రాచకొండ మైలారం ప్రాథమిక వ్యవసాయ సంఘం చైర్మన్ బిట్ల వెంకట్ రెడ్డి, బిజెపి జిల్లా కార్యదర్శి ఆదిభట్ల మున్సిపాలిటీ బిజెపి ఫ్లోర్ లీడర్ శ్రీ పొట్టి రాములు, బిజెపి జిల్లా నాయకులు ఈదులకంటి రామస్వామి గౌడ్, ప్రభాకర్ దండు, తుంకోజి సాయికుమార్ చారి, శ్రీమతి శ్రీదేవి, మండల కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి గుండ్ల శ్రీకాంత్ రెడ్డి, గ్రామ బూత్ అధ్యక్షులు జంగం వెంకట్ రెడ్డి, చింతల కృష్ణ ముదిరాజ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు పోకలకార్ హరి నారాయణ జి, బిఆర్ఎస్ నాయకులు గుండ్ల కృష్ణారెడ్డి, మంగ ఐలేష్, బిజెపి నాయకులు ఉదారి శివకుమార్, మల్లికార్జున చారి, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.