శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావు
హైదరాబాద్: జనవరి 22(భారత్ కి బాత్)
శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం మరియు బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సోమవారం నాడు నాగోల్ లోని మోహన్ నగర్ లో హనుమాన్ యువసేన ప్రెసిడెంట్ యష్ పాల్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావు విచ్చేసినారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ యువసేన కొత్తపేట్ డివిజన్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, వినోద్ సింగ్, తరుణ్ సింగ్ ఠాకూర్, వెంకటేష్, రాజేష్, భాస్కర్, రాజ్ గౌడ్, కులకర్ణి, యశ్వంత్, విష్ణు, అభిషేక్, అభినయ్, సాయి తదితరులు పాల్గొన్నారు.