Search for:
  • Home/
  • क्षेत्र/
  • జనవరి 22న ప్రతి ఒక్కరు ఇంటి వద్ద దీపాలు వెలిగించి దీపావళి జరుపుకోవాలి- కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి

జనవరి 22న ప్రతి ఒక్కరు ఇంటి వద్ద దీపాలు వెలిగించి దీపావళి జరుపుకోవాలి- కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి

రంగారెడ్డి: జనవరి 14(భారత్ కి బాత్)

 

ఈ(జనవరి) నెల 22వ తేదిన భవ్యమైన అయోధ్య రామ మందిరంలో శ్రీ రాముల వారి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా భారతమాత ముద్దుబిడ్డ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు పుణ్యక్షేత్రాల పరిసరాలు శుభ్రపరచే కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాడు హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి గ్రామంలోని పాత హనుమాన్ దేవాలయంలో పరిశుభ్రతా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వందల సంవత్సరాల భారత హిందువుల కల ఈ నెల 22వ తేదీన సహకారం కాబోతుందని, భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శ్రీ రాముల వారి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రతి ఒక్కరు వారి ఇంటి వద్ద దీపాలు వెలిగించి, మరోసారి దీపావళి జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షులు ఉగాది ఎల్లప్ప, ప్రధాన కార్యదర్శి సంఘీ అశోక్, నాయకులు ఎర్రవెలి సత్యనారాయణ, జనార్దన్, వస్పరి వెంకటేష్,లక్ష్మి దాస్, సరికొండ సురేష్, జంజా నాయక్, ఉగాది బాలు, బండారి ప్రవీణ్, బాలు నాయక్, సూర్య, బీజేవైఎం డివిజన్ అధ్యక్షులు ఎర్ర ప్రేమ్, అభి ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required