ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో బీసీ మహాసభకు వందలాదిగా తరలిరాబోతున్న బీసీలు: కళ్యాణ్ కార్ జాంగిర్ జీ
రంగారెడ్డి: జనవరి 27(భారత్ కి బాత్)
రాష్ట్ర మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్, తలకొండపల్లి మాజీ జడ్పీటీసీ, ఉప్పల ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నుండి ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో బీసీలందరూ వేలాదిగా హైదరాబాదుకు రాష్ట్ర బీసీ మహాసభకు తరలిరాబోతున్నామని రాష్ట్ర బీసీ మహాసభ ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ అన్నారు. తెలంగాణ బీసీ మహాసభ హైదరాబాదదులో జనవరి నెల 30వ తేదీన మధ్యాహ్నం 1 గంటలకు తెలంగాణ సర్వ పరిషత్ బొగ్గులకుంట అబిడ్స్ లో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సభ నిర్వహించడం జరుగుతుందని, ఈ సభకు తెలంగాణలో ఉన్న బీసీలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని, అదేవిధంగా స్టీరింగ్ కమిటీ రాష్ట్ర కమిటీ విభాగo జిల్లా అధ్యక్షులు, అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరిన కళ్యాణ్ కార్ జాంగిర్ జి.
అదేవిధంగా ఆయన మాట్లాడుతూ అదే రోజు నూతన సంవత్సర బీసీ మహాసభ డైరీ ఆవిష్కరణ, అలాగే టిబిసి న్యూస్ ఛానల్ లోగో ఆవిష్కరణ ఉంటుందని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ మహాసభలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు.