వనస్థలిపురంలో నూతనంగా ప్రారంభమైన హయగ్రీవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
రంగారెడ్డి: నవంబర్ 14(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లోని పోస్ట్ ఆఫీస్ నుండి గురుద్వారా ఆలయం ఎదురుగా గురువారం నాడు హయగ్రీవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ముఖ్య అతిథిగా లక్ష్మీ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ లక్ష్మీ హాజరై ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ హయగ్రీవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యజమాని రాజు ని ప్రత్యేకంగా అభినందించారు. రాజు ఎంతో కష్టపడే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని, ఎవరిపై ఆధారపడకుండా తన స్వశక్తితో ఎదిగారని కొనియాడారు. వనస్థలిపురంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించడం ఈ ప్రాంత వాసులకు వైద్య సేవలు మరింత దగ్గరయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజాపూర్ కౌన్సిలర్ బొక్క శ్రీలత గౌతమ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, డాక్టర్ హేమ, డాక్టర్ వాణి, వినోద్, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.