ఘనంగా రాములవారి అయోధ్య అక్షింతలు పంపిణీ
కల్వకుర్తి: జనవరి 5(భారత్ కి బాత్)
కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్లో అయోధ్య రామాలయం నుంచి వచ్చిన అక్షింతలను రామనామం కీర్తిస్తూ పంపిణీ చేశారు.
ఈనెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో ప్రాణ ప్రతిష్ట మహోత్సవం రోజున అక్షింతలను ఇంట్లో ప్రత్యేక పూజలు చేసి వాటిని ఇంటిల్లిపాది తలపై వేసుకోవాలని సూచించారు. అయోధ్య విగ్రహ ప్రతిష్ట రోజు ప్రతి ఒక్కరూ ఆయా గ్రామాల్లోని ప్రతి ఇంటిలో పండుగ చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యానగర్ వాసులు శ్వేతా రెడ్డి, కల్వ లక్ష్మి, ప్రభావతి, విజయలక్ష్మి, పద్మ, జ్యోతి, రమాదేవి, శాలిని, జ్యోతి, పావని, లక్ష్మి, లలితా, వెంకటమ్మ, తేజస్విని, రేణుక, లలితమ్మ, అనూష తదితరులు పాల్గొన్నారు.