రాష్ట్ర ప్రభుత్వం గో హత్యల పైన ప్రత్యేక ద్రుష్టి పెట్టాలి: హయత్ నగర్ భాజపా శ్రేణులు
రంగారెడ్డి: జనవరి 5(భారత్ కి బాత్)
ఆంధ్రప్రదేశ్ (తుని) నుండి అక్రమంగా హైదరాబాద్ కు తరలిస్తున్న 25 గోమాతలను శుక్రవారం నాడు పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పట్టుకొని సంబంధిత పరిధిలోని మెట్టు పోలీస్ స్టేషన్ లో అప్పగించిన హయత్ నగర్ భాజపా శ్రేణులు. హయత్ నగర్ భాజపా డివిజన్ ప్రధాన కార్యదర్శి గోవింద చార్రు మాట్లాడుతూ ఇందులో చిన్నచిన్న ఆవులు, లేగ దూడలు ఉన్నాయని వీటిని చూసి కూడా కనికరం లేకుండా కసాయికి తీసుకు వెళ్తుంటే ప్రభుత్వం చూసి చూడనట్టు కొందరి వ్యక్తులకు భయపడి, ఇలాంటి వాటి ప్రాణాలు తీస్తున్నారని తెలిపారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా, గోమాతలను కాపాడవలసిన బాధ్యతను నిర్వర్తించాలని తెలియజేస్తూన్నానన్నారు. హిందూ బంధువులందరికీ ఒకటే విన్నపం మనకు ఇలాంటి ఆవుల లారీలు ఎక్కడ కనిపించినా వెంటనే 100 కి కాల్ చేసి వాటిని గోషాలకు అప్పగించాలని తెలియజేస్తూన్నానని విజ్ఞప్తి చేశారు. ఇందులో హయత్ నగర్ భాజపా డివిజన్ ప్రధాన కార్యదర్శి గోవింద చార్రు, సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి, అరుణ్, బీజేవైఎం అధ్యక్షులు ఎర్ర ప్రేమ్ లు అడ్డుకున్నామన్నారు.