కల్తీ ఆహారంపై చర్యలు తీసుకోవాలి: కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి
రంగారెడ్డి: జనవరి 4(భారత్ కి బాత్)
జి హెచ్ ఎం సి మేయర్ శ్రీమతి గద్వాల విజయ లక్ష్మిని మరియు జి హెచ్ ఎం సి కమీషనర్ రానల్ రోస్ ని కలిసి నగరంలో పేరుకు పోయిన సమస్యలను చర్చించేందుకు ప్రతీ మూడు నెలలలో ఒకసారి పాలక మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, ప్రాపర్టీ టాక్స్ ఎగ్గొడుతున్న బడా వ్యాపారావేత్తలు, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, హోటల్స్ పైన చర్యలు తీసుకోవాలని, అక్రమ పార్కింగ్, కమర్షియల్ కాంప్లెక్స్ లలో ఫైర్ సేఫ్టీ నార్మ్స్ పరిశీలించాలని, అభివృధి పనులు వెంటనే ప్రారంభించాలని, కల్తీ ఆహారంపై నివారణ చెర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందనని సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి తెలిపానని అన్నారు.