Search for:
  • Home/
  • Uncategorized/
  • తుక్కుగూడలో నూతనంగా ప్రారంభమైన శ్రీ విశిష్ట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

తుక్కుగూడలో నూతనంగా ప్రారంభమైన శ్రీ విశిష్ట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

రంగారెడ్డి: అక్టోబర్ 16(భారత్ కి బాత్)

 

మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలో మంఖాల్ కమాన్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ విశిష్ట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ తో కలిసి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరియు శ్రీరాములు హాస్పటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యజమాని డాక్టర్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ మా వద్ద నాణ్యత ప్రమాణాలతో కూడిన వైద్యం ప్రజలందరికీ, పేద, మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ బరిగల హేమలత రాజు గౌడ్, స్థానిక కౌన్సిలర్లు కాంటెకర్ మధుమోహన్, రాజమోని రాజు ముదిరాజ్, జపాల భావన సుధాకర్, బాకీ విలాస్, బిజెపి సీనియర్ నాయకులు శ్రీనివాస్ నాయక్, శ్రీధర్ గౌడ్, బీజేవైఎం అధ్యక్షులు బరిగల రాకేష్ గౌడ్, లవ కుమార్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required